
తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలన్న కాంక్ష ఉన్న కొంత మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బ్రింగ్ బ్యాక్ బాబు (బి.బి.బి)అన్న పేరుతో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వివిధ అబివృద్ది కార్యక్రమాలు, ఇతర విశేషాలు ఇందులో ఉంటాయి.గ్రామాలలో సైతం టిడిపి హయాంలో జరిగిన వివిధ పనుల చిత్రాలను ఇందులో పెడతారు.తాము సాఫ్ట్ ఇంజనీర్లుగా స్ధిరపడి సంతోషంగా ఉండడానికి కారణం చంద్రబాబు హయాంలో వచ్చిన హైటెక్ సిటీ వంటి పరిణామాలని వారు ప్రచారం చేస్తున్నారు. దీనిని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారు.ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా,వెబ్ సైట్ల ద్వారా ఇంటర్ నెట్ ప్రపంచంలో రాజకీయ పార్టీల ప్రచారానికి మంచి ఊపు వస్తోంది.అయితే ఇది ముఖ్యంగా మేధావి వర్గాలవారికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ మన దేశంలో కోట్ల మంది కంప్యూటర్ అంటే ఎలా ఉంటుందో తెలియని వారే ఉన్నారు.కంప్యూటర్ ,ఇంటర్ నెట్ తో సంబంధాలు ఉన్నవారిలో చాలామంది నిర్దిష్టమైన భావజాలంతో ఉంటున్నారు.వీరిని కొత్తగా ఎంత ప్రభావితం చేస్తారన్నది చర్చనీయాంశమే. అయితే ఏదైనా తటస్థంగా ఉన్నవారిని కొంత ప్రభావితం చేస్తే చేయవచ్చు. టిడిపినే కాదు.ఇతర పార్టీలు కూడా ఇలాగే వెబ్ సైట్లుఆరంభించాయి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,జగన్ కు అనుకూలంగా పలు వెబ్ సైట్లు నడుస్తున్నాయి. కనుక ఇంటర్ నెట్ లో కూడా ఈ రెండు పార్టీల ప్రచారం తీవ్రం అవుతుందని బావించవచ్చు.అయితే బ్రింగ్ బ్యాక్ బాబు అన్న నినాదం ఊళ్లలోకి తీసుకు వెళ్లే ఆలోచనను టిడిపి అభిమానులు ప్రయత్నిస్తున్నారు.బ్రింగ్ బ్యాక్ బాబు అన్నప్పుడు ఏ ఏ పాయింట్ల మీద చంద్రబాబు అధికారంలోకి రావల్సిన అవసరం ఉన్నది వీరు సమర్దంగా వివరించవలసి ఉంటుంది.నినాదం వరకు అయితే బాగానే ఉంది .మరి ఫలితం ఎలా ఉంటుందన్నదే ఆసక్తికర అంశం.
0 Reviews:
Post a Comment