Contact us

హైదరాబాద్ నగరం పాకిస్థాన్ రాజధాని అయి ఉండేదా?
గుంటూరు: భారత హోంశాఖ మాజీ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్‌పై ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద సరస్వతీ స్వామిజీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆనాడు వల్లభ్‌భాయి పటేల్‌ లేకుంటే హైదరాబాద్ నగరం పొరుగు దేశమైన పాకిస్థాన్ రాజధాని అయి ఉండేదని అన్నారు. ఆయన గురువారం గుంటూరుకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. వల్లభ్‌భాయి పటేల్‌ పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల మహా మనిషి అని పరిపూర్ణానంద సరస్వతీ స్వామిజీ కొనియాడారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో ప్రతిష్టించడం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సేవలను కూడా స్వామిజీ ప్రశంసించారు. ఆయన ఒక కులానికి మాత్రమే పరిమితం కాదని, ప్రతీ భారతీయుడి గుండెల్లో గూడు కట్టుకున్న మహానీయుడని కీర్తించారు. దేశంలోని హిందూ దేవాలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని సరస్వతి స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కురుక్షేత్రంగా మారకూడదని, పవిత్ర ధర్మక్షేత్రంగా భాసిల్లాలని పరిపూర్ణానంద సరస్వతీ స్వామిజీ ఆకాంక్షించారు.

Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/paripoornananda-saraswati-swamiji-praises-vallabhbhai-patel-129169.html

0 Reviews:

Post a Comment