
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమాంధ్ర రాష్ట్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమలోని నేతలు వ్యక్తిగత స్వార్థం కోసం సీమ ప్రజలను బలిపశువులను చేస్తున్నారని దుయ్యబట్టారు.అవకాశవాద రాజకీయం కోసం తెలంగాణ అంశాన్ని బయటికి తీసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. వెనుకబడిన సీమ అభివృద్ధికి తోడ్పడాల్సిన నేతలు సమైక్యం అంటూ మాయమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీమలో రాజధానిని ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ నేత చంద్రబాబు, వైసీపీ నేత జగన్ ఎందుకు డిమాండు చేయడం లేదని ప్రశ్నించారు. సీమలో గానీ రాజధాని రాకుంటే మరో 20 ఏళ్ల తర్వాత అయినా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/56163#sthash.GTuMGwjn.dpuf
0 Reviews:
Post a Comment