
ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉందా?కొద్ది కాలం క్రితం వరకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన విజయవాడ నుంచి లోక్ సభ కు పోటీచేస్తారని ప్రచారం జరిగినా,ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వెనక్కి తగ్గారు. ప్రధానంగా ఆయన సూచించిన విధంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాని అప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం ఆ సీట్లకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసింది.దాంతో వారు ఆయన డిమాండ్ కు సుముఖత వ్యక్తపరచలేదు.దాంతో ఆయన విజయవాడ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన పోటీ చేయడానికి వెనక్కి తగ్గారు.ఆ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం సీనియర్ నేత ఒకరు పివిపిని తెలుగుదేశం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించారు
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వర్గ రాజకీయాలలో భాగంగా కూడా ఈ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. విజయవాడ సీటుకు పివిపి అయితే బాగుంటుందని పార్టీ అదినేత చంద్రబాబు వద్దకు ఆ నాయకుడు రాయబారం చేశారు. అంతేకాక , పివిపిని చంద్రబాబు తో మాట్లాడే ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడారు కాని విజయవాడ సీటుకు హామీ ఇవ్వలేదు. వేరే సీటు ఏదైనా ఎంపిక చేసుకోవాలసి సూచించారని అంటున్నారు.విజయవాడ సీటును ఇప్పటికే ప్రముఖ రవాణ సంస్థ అధినేత కేశినేని నాని కి చంద్రబాబు హామీ ఇచ్చారు. వస్తున్నా మీకోసం యాత్ర సందర్భంగా కృష్ణ జిల్లలో అయిన కోట్ల రూపాయల ఖర్చు అంతా నాని భరించారని,అందువల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా ఉండజాలమని నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాక జిల్లా లోని మరోవర్గం నేతలు కూడా నానికే మద్దతు ఇచ్చారట.దీంతో ఈ వ్యవహారం పెండింగులో పడింది.ఒకప్పుడు నాదర్ గుల్ భూములను సబందించిన వివాదంతో ఒక పత్రిక యజమాని సూర్యప్రకాష్ రావు , పివిపి అక్రమంగా పొందారని అంటూ చంద్రబాబు ధర్నా చేశారు. ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికలలో సూర్యప్రకాష్ రావుకు అనకాపల్లి టిక్కెట్ ను చంద్రబాబు ఇచ్చారు.ఇప్పుడు ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వడానికి కూడా టిడిపి పెద్దగా ఇబ్బందిపడడం లేదు. కాకపోతే విజయవాడ బదులు మరోసీటు ఎంపిక చేసుకోవాలని అన్నారట. రాజకీయాలు ఇలా ఉంటాయి.ఏ పార్టీ అయినా ఫర్వాలేదు టిక్కెట్ వస్తే ఫర్వాలేదని అభ్యర్ధులు, అభ్యర్ధి ఎవరైనా ఫర్వాలేదు..గెలిచే ఆర్ధిక స్థోమత ఉంటే చాలని రాజకీయ పార్టీలు భావించే రోజులివి.
0 Reviews:
Post a Comment