Contact us

రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేయడంలేదు
రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేయడంలేదు: మైసూరారెడ్డి
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేయడంలేదని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. అభ్యర్థిని గెలిపించుకునేటంత సంఖ్యాబలం తమకు లేదుని ఆయన చెప్పారు. ఇతర పార్టీల బలంమీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడితే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనన్నది తమ అభిప్రాయమని మైసూరా రెడ్డి తెలిపారు. విభజనకు అనుకూలంగా మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
 
శాసనసభ ఎన్నికలు తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కాంగ్రెస్‌, టీడీపీ భయపడ్డాయని మైసూరా అన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపేలా ఎన్నికల కమిషన్‌మీద ఒత్తిడితెచ్చి తెచ్చాయని విమర్శించారు. అయితే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యాబలం టీడీపీకి ఇప్పుడు లేదని అన్నారు. కాంగ్రెస్‌తో ఉన్న కుమ్మక్కు కారణంగానే రెండో అభ్యర్థిని టీడీపీ నిలబెడుతోందని మైసూరా రెడ్డి విమర్శించారు

0 Reviews:

Post a Comment