Contact us

హైదరాబాద్ భూములు అమ్మాలంది కెసిఆరే
హైదరాబాద్ లో భూములు అమ్మాలని సలహా ఇచ్చింది అప్పట్లో మంత్రిగా ఉన్న కె.చంద్రశేఖరరావేనని టిడిపి నేత , సీనియర్ ఎమ్మెల్యే కేశవ్ అన్నారు.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి వాటిని అమ్మి ప్రజోపయోగాలు చేపట్టాలని చెప్పింది కెసిఆర్ అని అన్నారు. తెలంగాణలో అనేక అబివృద్ది పనులు,నీటిపారుదల ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయని అన్నారు.ఆసియాలోనే పెద్దదైన దేవాదుల లిఫ్ట్ ప్రాజెక్టు వచ్చింది చంద్రబాబు హయాంలోనే అని ఆయన అన్నారు.మహబూబ్ నగర్ జిల్లాలో నీటి ప్రాజెక్టులు, సిద్దిపేట కు నీరిచ్చింది సమైక్య రాష్ట్రంలో కాదా అని ఆయన ప్రశ్నించారు.హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేసింది సమైక్య రాష్ట్రంలో కాదా అని ఆయన అన్నారు.భారీ నీటి పారుదల శాఖ మంత్రులుగా అత్యధికులు తెలంగాణకు చెందినవారేనని ఆయన చెప్పారు.తెలంగాణ ఎంతో అబివృద్ది చెందిందని ,కాని అనంతపురం జిల్లా ఇప్పటికీ నీళ్లు లేక విలవిలలాడుతోందని అన్నారు.బాబ్లి ప్రాజెక్టు వల్ల నష్టం వస్తుందని చెప్పింది టిడిపినేనని, ఇది తెలంగాణకోసం అని బాదపడలేదని,అందరిది అని భావించామని అన్నారు.టిఆర్ఎస్ నేతలు వింతవాదనలు,వితండ వాదనలు తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు

0 Reviews:

Post a Comment