Contact us

రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపేది లేదన్న జగన్!
రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బాగా పోరాడితే అభ్యర్థిని గెలిపించుకొనే అవకాశం ఉన్నప్పటికీ జగన్ పార్టీ విషయంలో ఉత్సాహం చూపడం లేదు. రాజ్యసభ బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపుగా ఉండడని తెలుస్తోంది. 
కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థి గెలిపించుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో... ఆ పార్టీ తగినంత బలం లేకపోవడంతో జగన్ పార్టీ గనుక ఈ బరిలో నిలిస్తే పోరు ఆసక్తికరంగా మారేది. అయితే జగన్ మాత్రం అలాంటి ఆసక్తిని రేకెత్తించే పోటీకి జెండా ఊపడం లేదు. మరి ఏం లెక్కలు వేసుకొన్నాడో కానీ రాజ్యసభ ఎన్నికకు పోటీ వద్దని పార్టీ నాయకులకు స్పష్టం చేశాడట.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి సొంతంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరుగాక కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జగన్ కు మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా జగన్ పార్టీకి పాతిక మంది ఎమ్మెల్యేలు మద్ధతుగా నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఈ బలంతో జగన్ పార్టీ సొంతంగా ఒక అభ్యర్థిని గెలిపించుకోలేదు. అయితే కాంగ్రెస్  నుంచి ఓట్ల చీలిక ఉంటుందని ఆ చీలికను సద్వినియోగం చేసుకొంటే జగన్ నిలబెట్టే అభ్యర్థి  గెలవడానికి అవకాశం ఉంటుంది. అయితే జగన్ రెడ్డి ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదని సమాచారం. 
ఒకవేళ రిస్క్ చేయదలుచుకొన్నా పార్టీలో ఎవరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి? అనేది కూడా జగన్ కు సమస్యగా మారే అవకాశం ఉంది. చాలా మంది ఆశావహుల మధ్య సభ్యత్వం ఎవరికి ఇవ్వాలో తేల్చడం కొంతమందిని అసంతృప్తులను తయారు చేయవచ్చు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా రాజ్యసభ ఎన్నికల జోలికి వెళ్లకుండా ఉండాలని భావించినట్టు సమాచారం. 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/no-candidate-for-rajya-sabha-49853.html#sthash.shtur7D0.dpuf

0 Reviews:

Post a Comment