Contact us

గ్రేహౌండ్స్ ఐజీ నుంచి ప్రాణహాని: వంశీ
వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు
హైదరాబాద్ : టీడీపీ నేత వల్లభనేని వంశీ ఫిర్యాదుపై తనకేమీ తెలియదని గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు తెలిపారు. దానిపై మాట్లాడటానికి ఏమీలేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. గతంలో  విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సీతారామాంజనేయులు ....వల్లభనేని వంశీల మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అనంతరం బదిలీపై సీతారామాంజనేయులు హైదరాబాద్ వచ్చేశారు.

కాగా సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ  వల్లభనేని వంశీ డీజీపీ ఫిర్యాదు చేశారు. మజీ నక్సల్స్‌తో చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు భద్రత కల్పించి ప్రాణాలను కాపాడాలని డీజీపీ ప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ అపాయింట్‌మెంట్ కూడా వంశీ కోరినట్లు సమాచారం.


‘నాకు ప్రాణహాని వుంది..’ అంటూ గతంలో చాలాసార్లు వార్తల్లోకెక్కిన వల్లభనేన వంశీ, ఈసారి ఐజీ సీతారామాంజనేయులుపై అవే ఆరోపణలు చేస్తూ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. విజయవాడ సీపీగా పనిచేస్తున్నప్పుడే ఐజీ సీతారామాంజనేయులుకీ, వల్లభనేని వంశీకి మధ్య వివాదం తలెత్తింది. అప్పట్లోనే తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీతారామాంజనేయులుపై ఆరోపణలు చేశారు వల్లభనేని వంశీ. తాజాగా మరోమారు అవే ఆరోపణలు చేస్తూ, ప్రస్తుతం ఐజీగా వున్న సీతారామాంజనేయులుపై డీజీపీకి వంశీ ఫిర్యాదు చేశారు. గ్రేహౌండ్స్‌ ఐజీగా సీతారామాంజనేయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నక్సల్స్‌ ద్వారా తనను చంపించేందుకు ఐజీ సీతారామాంజనేయులు వ్యూహం పన్నారని ఆరోపిస్తున్నారు వంశీ. అయితే వంశీ ఆరోపణల్ని ఐజీ సీతారామాంజనేయులు కొట్టి పారేశారు. వంశీ ఫిర్యాదు గురించి తనకేమీ తెలియదనీ, స్పందించడానికీ అందులో ఏమీ లేదని ఆయన అంటున్నారు. మొత్తమ్మీద, ప్రాణహాని పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో దిట్ట అయిన వంశీ, ఈసారి మరింతగా ప్రాణ హాని గురించిన వార్తలతో హల్‌చల్‌ చేస్తున్నారన్నమా. సీతారామాంజనేయులు సైతం పలు వివాదాలను గతంలో ఎదుర్కోవడంతో వంశీ ఆరోపణల్లోనూ ఎంతోకొంత నిజం లేకపోలేదన్న వాదనకు బలం చేకూర్చుతోంది. ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోగానీ.. పోలీసు శాఖలో అంచలంచెలుగా ఎదుగుతోన్న సీతారామాంజనేయులుతో వంశీ ఢీకొంటుండడం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. 

http://telugu.greatandhra.com/politics/gossip/ig-nunchi-pranahani-49800.html 

0 Reviews:

Post a Comment