Contact us

కేజ్రీవాల్ కిడ్నాప్ కు ఐఎం కుట్ర
కేజ్రీవాల్ కిడ్నాప్ కు ఐఎం కుట్రఅరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కిడ్నాప్ చేయడానికి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కుట్ర పన్నింది.  అయితే నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. కేజ్రీవాల్ కు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

తమ నాయకుడు యాసిన్ భత్కల్ ను తప్పించేందుకు ఐఎం వ్యూహ్యాం పన్నినట్లు  కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. భత్కల్ ను విడిపించుకునేందుకు ఐఎం కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. భత్కల్ ను విమానంలో హైజాక్ చేసే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఢిల్లీ విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.  అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

యాసిన్ భత్కల్ ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్నాడు. 2010, ఏప్రిల్ 17న బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్ల కేసులో అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

sakshi

0 Reviews:

Post a Comment