Contact us

సీమాంద్ర రాజధానితో మందకృష్ణకు ఏమి పని!


ఏదో ఒక వివాదం ద్వారా మంద కృష్ణ మాదిగ ప్రచారంలో ఉంటారు.ఇంతకాలం ఎమ్.ఆర్.పి.ఎస్.ను నడిపిన కృష్ణ ఇప్పుడు సొంతంగా మహాజన్ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు సీమాంద్ర రాజదాని గురించి మాట్లాడుతున్నారు.శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమాంధ్ర రాష్ట్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ఆయన చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఎక్కడ రాజధాని అన్నదానితో ఈయనకు ఏమి సంబందమో తెలియదు.సీమలో రాజధానిని ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ నేత చంద్రబాబు, వైసీపీ నేత జగన్ ఎందుకు డిమాండు చేయడం లేదని ప్రశ్నించారు. రాయలసీమలోని నేతలు వ్యక్తిగత స్వార్థం కోసం సీమ ప్రజలను బలిపశువులను చేస్తున్నారని దుయ్యబట్టారు.

0 Reviews:

Post a Comment