Contact us

బ్రింగ్ బాబు బ్యాక్
చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరమని ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలంటే అది టీడీపీ అధినేత వల్లనే సాధ్యమని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రజలకు వివరిస్తున్నారు. 'మేము రైతు బిడ్డలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయ్యామంటే బాబు ముందుచూపే కారణం, ఆయన్ను ఎన్నుకుంటే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్‌ను చూస్తారు'' అని చెబుతున్నారు. వివిధ రంగాల వృత్తి నిపుణులు, యువకుల ఆలోచనకు రూపమే "బ్రింగ్ బాబు బ్యాక్'' అన్న స్వచ్ఛంద ఉద్యమమని కొండాపూర్ ప్రాంతంలో ప్లకార్డులు చేతబట్టి ప్రజలకు వివరిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చెప్పారు. నాలుగు రోజుల క్రితం "సీబీఎన్ ఆర్మీ'' పేరుతో ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, శనివారం హైదరాబాద్ కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్‌లో అధికారికంగా "బ్రింగ్ బాబు బ్యాక్'' ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నారా లోకేశ్ హాజరవుతున్నారని చెప్పారు. కాగా.. సోషల్‌మీడియా, సెల్‌ఫోన్ అప్లికేషన్లు, షార్ట్‌ఫిల్మ్‌లు, పోస్టర్లు తదితర రూపాల్లో పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆ పార్టీ ఎన్నారై సభ్యులను కోరారు. వారు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, సమాజ రుగ్మతలపై వినూత్న రీతిలో ప్రచారం చేయాలని ఎన్నారై టీడీపీ సభ్యులను కోరారు.


andhrajyothy.com/node/57349#sthash.OmoHK8pu.dpuf

0 Reviews:

Post a Comment