
ఒకపక్కన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లు తమ ప్రత్యర్దులను దోపిడీదారులని, అవినీతిపరులని, మోసగాళ్లని ప్రచారంచేస్తుంటే , మరో వైపు వారి పార్టికి చెందినవారిపై ఆరోపణలు వస్తున్న తీరు ఆ పార్టీకి ఇబ్బంది కలిగించేదే.కొద్ది రోజుల క్రితం బొమ్మరిల్లు పేరుతో రియల్ ఎస్టేట్ మోసం చేసిన రాజారావు టిడిపి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జీ అని తేలితే,తాజాగా ఆ పార్టీ పార్లమెంటరీ విభాగం నేత నామా నాగేశ్వరరావు పై ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖ కాంట్రాక్టర్ కూడా అయిన నామా నాగేశ్వరరావుపై ,ఆయన చేపట్టిన కుకట్ పల్లి ప్రాజెక్టు పై సిబిఐ లేదా సిఐడి దర్యాప్తు జరపాలని రాష్ట్ర విజిలెన్స్ విభాగం సిఫారస్ చేసిందన్న కదనం కలకలం రేపుతుంది, రెండువేల నాలుగులో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ విస్తీర్ణం కల భూమిని నామా కు చెందిన మదుకాన్ సంస్థకు కేటాయించారు.ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో హోటల్,మాల్స్ తదితర నిర్మాణాలు జరగవలసి ఉంది.హౌసింగ్ బోర్డు ఈ ఒప్పందాన్ని రెండువేల పదకుండు వరకు పొడిగించినా, అది పూర్తి కాలేదు.దీనిపై విజిలెన్స్ మొత్తం పూర్వాపరాలపై విచారణ జరిపి అసలు ఒప్పందంలోనే లొసుగులు ఉన్నాయని, అర్హత సర్టిఫికెట్లే అనుమానాస్పదంగా ఉన్నాయని అబిప్రాయపడింది.ఈ నేపధ్యంలో అవినీతి కేసును నమోదు చేసి దర్యాప్తు చేయాలని విజిలెన్స్ విబాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.దీనిపై నామా నాగేశ్వరరావు ఎలా స్పందిస్తారో చూడాలి.
http://kommineni.info/articles/dailyarticles/content_20140121_5.php
0 Reviews:
Post a Comment