శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు వెంకనపాలెంలో మంగళవారం అరుదైన వింత చేపలు రెండు బయటపడ్డాయి. దుంపల మహేంద్ర అనే రైతు సాగునీటి కోసం తవ్విన దొరువులో ఈ చేపలు దర్శనమిచ్చాయి. నలుపురంగులో ఉన్న ఈ చేపలలో ఒక దానిని పట్టుకొనే ప్రయత్నం చేయగా చేయి కొరికింది. వెంటనే మొప్పలను విరిచేశారు. మరో చేపను మాత్రం చిన్నతొట్టిలో భద్రపరిచారు. చేప మొహం తొండ మూతిని పోలివుంది. మొహంలో ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దొరువు నుంచి తీసి నేలపై ఉంచగానే కొద్దిసేపు ఎగిరింది. శరీరం కింద ఉన్న నాలుగు మొప్పల సాయంతో నడవడం మొదలుపెట్టింది. నేలపైన, నీటిలోన ఒకే విధంగా సంచరించడం దీని ప్రత్యేకత. ఈ వింత చేపలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిచూపారు.
0 Reviews:
Post a Comment