Contact us

ఈటీవీ వాటా కొనుగోలు పూర్తి
ఈటీవీ వాటా కొనుగోలు పూర్తి: నెట్‌వర్క్ 18
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈటీవీకి చెందిన వివిధ చానల్స్‌లోని వాటాల కొనుగోలుకు సంబంధించి అధికారికంగా అన్ని అనుమతులు లభించినట్లు నెట్‌వర్క్18 గ్రూపు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2012లో ఈటీవి ప్రాంతీయ చానల్స్‌లో వాటాలను రూ.2,053 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వాటాల కొనుగోలు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లు నెట్‌వర్క్18 తాజాగా పేర్కొంది.

తెలుగు కాకుండా వేరే భాషలకు చెందిన న్యూస్ చానల్స్‌లో 100%, అలాగే వేరే భాషలకు చెందిన వినోద చానల్స్‌లో 50% వాటాను నెట్‌వర్క్ 18 కొనుగోలు చేసింది. తెలుగు చానల్స్‌లో 24.5% వాటా నెట్‌వర్క్ 18 పరమయ్యింది. మార్గదర్శి వ్యవహారంతో చిక్కుల్లోపడ్డ రామోజీరావును ఆదుకోవటానికి షెల్ కంపెనీల ద్వారా రూ.2,600 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈటీవీ గ్రూపులో పెట్ట డం తెలిసిందే. ఆ విషయాన్ని మూడేళ్లపాటు గోప్యంగా ఉంచాక, సాక్షి బయటపెట్టాక... కోర్టులో రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్‌కు ఆ డబ్బు చెల్లించకుండా రిలయన్స్‌తో జట్టుకట్టిన నెట్‌వర్క్-18కు ఈటీవీ తన చానెళ్లలో వాటాను విక్రయించింది.

0 Reviews:

Post a Comment