Contact us

టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట వాస్తవమే
టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట నిజమే: గల్లా జయదేవ్గల్లా జయదేవ్‌
చిత్తూరు: టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట వాస్తవమేనని మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్‌ అంగీకరించారు. ఏ పార్టీలో చేరాలన్న అంశంపై తమ కుటుంబంలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. చాలా కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. గుంటూరు నుంచి పోటీ అన్నది మంచి అవకాశంగా భావిస్తున్నట్లు  గల్లా జయదేవ్‌ తెలిపారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేసే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఈ నెలాఖరుకల్లా తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ ఉదయం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జయదేవ్ కు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి గల్లా అరుణ కుమారి కూడా చెప్పారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఏలాంటి నిర్ణయం తీసుకున్నా మిగతా అందరి మద్దతు ఉంటుందని చెప్పారు.

sakshi

0 Reviews:

Post a Comment