Contact us

కిరణ్ పై జగన్ ఈ ఆరోపణ కరెక్టేనా
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత పెరగాలని ఆయన అన్నారు.కాగా ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని జగన్ పేర్కొన్నారు.
30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు.ఎన్.జి.ఓలతో సమ్మె చేయించిందే కిరణ్ అన్న విమర్శ ఉంటే జగన్ ఏమో కిరణ్ నీరు కార్చారని అంటున్నారు.అప్పటికే రెండు నెలలు సమ్మె చేస్తే ఇంకెంత కాలం చేయాలని జగన్ కోరుకుంటున్నారు.జగన్ ఆరోపణ కరెక్టేనా!

kommineni

0 Reviews:

Post a Comment