Contact us

అధికారిక విద్యుత్ కోతలు
సదరన్ డిస్కం పరిధిలో నేటి నుంచి  విద్యుత్ కోతలు
హైదరాబాద్: సదరన్ డిస్కం పరిధిలో నేటి నుంచి అధికారిక విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. నగరాల్లో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తారు. కొన్ని నగరాలలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కోతలు విధిస్తారు. పట్టణాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం  4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.

మండల కేంద్రాల్లో 6 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు చేస్తారు. కొన్ని మండలాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలు విధించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే 12 గంటల పాటు కోతలు అమలు చేస్తారు.

sakshi

0 Reviews:

Post a Comment