
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్ ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
0 Reviews:
Post a Comment