
కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కల్పించుకుని వైఎస్ బలమైన, ప్రజాదరణ కలిగిన నాయకుడనే విషయంలో ఎలాంటి వివాదం లేదని, న్యాయపరమైన కోరిక అయిన తెలంగాణను అధిష్టానం పరిశీలిస్తోందని వైఎస్ సభలోనే చెప్పారని అన్నారు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉంటుంది, ఆయా ప్రాంతాన్ని బట్టి యాస ఉంటుంది.. వీటిని బట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే కేంద్రాన్ని మెడలు వంచే స్థాయి నుంచి కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ మాట్లాడుతూ దుర్బుద్ధితోనే పవర్ ప్రాజెక్టులన్నీ సీమాంధ్రలో ఏర్పాటు చేశారన్నారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్ప: సీఎం
ముఖ్యమంత్రి పదవికన్నా ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్పదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 16 మంది సీఎంలైనప్పటికీ.. వారిలో దామోదరం సంజీవయ్య ఒక్కరే దళితుడని అన్నారు. ఆయన్నూ రెండేళ్లకే తప్పించారన్నారు. ఆ సమయంలో సీఎం స్పందిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవయ్యను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశారని, సీఎం కంటే ఏఐసీసీ అధ్యక్షుడి పదవే గొప్పదని అన్నారు.
sakshi
0 Reviews:
Post a Comment