
తాను సంపాదించిన లక్ష కోట్లను వెదజల్లి అదికారంలోకి వచ్చి కోటి కోట్లను సంపాదించాలని వై.ఎస్.జగన్ కలలు కంటున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు. డబ్బు ఎలా ఆర్జించాలనే ఆయన కలలు కంటారని ఆయన విమర్శించారు. అవినీతి జాతికి ఆయన రాజు అని కూడా లోకేష్ పంచ్ డైలాగులు విసురుతున్నారు.తెలుగుజాతి భవిష్యత్తును నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు.అయితే లోకేష్ ఇలాంటి విమర్శలు చేయడానికి ఉన్న అర్హత ఏమిటని మాజీ మంత్రి , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత విశ్వరూప్ ధ్వజమెత్తారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.అయితే లోకేష్ కోటి కోట్లు అంటూ డైలాగుల కోసం అతిశయోక్తిగా మాట్లాడారా!
0 Reviews:
Post a Comment