వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర పైన ఆ పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తితో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ, కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కుప్పం నుండి శ్రీకాకుళం వరకు సమైక్యాంధ్ర శంఖారావం చేపట్టారు. తెలంగాణలోను పర్యటించి సమైక్యాంధ్రకు మద్దతు కూడగడతానని జగన్ చెప్పారు. అయితే, జగన్ యాత్ర దాదాపు రెండు నెలలు చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతుండటంతో సమైక్యాన్ని బలంగా కోరుకుంటున్న ఆ పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉందట. జగన్ తన యాత్రను నవంబర్ 29వ తేదీన కుప్పం నియోజకవర్గం నుండి ప్రారంభించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే రెండు నెలల పాటు యాత్ర చేస్తే మిగతా జిల్లాలు పర్యటించేందుకు సంవత్సరాలు పడుతుందని ఆవేదన వ్యక్తం
Read more at: http://telugu.oneindia.in/grapevine/2014/ys-jagan-yatra-slows-down-129336.html
చేస్తున్నారట. తెలంగాణను అడ్డుకుంటానని, కాంగ్రెసు - టిడిపిల కుమ్మక్కును ప్రజలకు వివరిస్తానని చెప్పిన జగన్ ఒక్కో జిల్లాలో ఇన్ని రోజులు పర్యటిస్తే ఎన్నికల్లోగా మిగతా జిల్లాలు పూర్తి చేయడం అసాధ్యమంటున్నారు. ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయమే ఉన్నందున జగన్ త్వరగా జిల్లాలను చుట్టి రావాలని కోరుతున్నారట. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపించే కంటే ముందే జగన్ తన యాత్రను ప్రారంభించారని, బిల్లు పైన చర్చ ముగింపు దశకు వచ్చినా ఇంకా రెండో జిల్లాలో పర్యటన కూడా కాలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటన ఆలోచనను పక్కన పెట్టి మిగిలిన సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సాధ్యమైనంత ఎక్కువగా.. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టే లోపు పూర్తి చేస్తే పార్టీకి లాభిస్తుందని అంటున్నారు.
Read more at: http://telugu.oneindia.in/grapevine/2014/ys-jagan-yatra-slows-down-129336.html
0 Reviews:
Post a Comment