
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొబైల్ సందేశాలపై చేసిన వ్యాఖ్యలకు అనుకోని విధంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రవర్తనపై ప్రశ్నించేందుకు ఆ వ్యాఖ్యలు దారి తీశాయి. యువకులు అమ్మాయిలకు ఎస్ఎంఎస్‌లు పంపడం కాదు, అవినీతికి వ్యతిరేకంగా ఎస్ఎంఎస్‌లు చేయాలని చంద్రబాబు ఇటీవల తన పాదయాత్రలో చెప్పారు. ఈ వ్యాఖ్యకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అనుకోని రీతిలో ప్రతిస్పందించారు.
‘మీ అబ్బాయి అమ్మాయిలకు ఎస్‌ఎంఎస్‌లు పంపించేవాడా?' అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అబ్బాయిలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు యువకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గండ్ర బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, పుల్లా పద్మావతి కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా యువతను అవమానించాడని గండ్ర అంటున్నారు. "మీ కుమారుడు అలాగే పెరిగారా?" అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తాను మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని చెప్పడం విస్మయం కలిగించిందని అన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం చారిత్రాత్మక అవసరమా? అని ప్రశ్నించారు.
Read more at: http://telugu.oneindia.in/grapevine/2013/gandra-questions-chandrababu-111137.html
0 Reviews:
Post a Comment