Contact us

టిక్కెట్టివ్వలేదని తగలబెట్టిన చరిత్ర మీది..
పదవులు పొందినవారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం తగదంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్‌ తీవ్రంగా స్పందించారు. తన గురించి విమర్శలు చేసే నైతిక హక్కు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేదని టీజీ వెంకటేష్‌ ఎదురుదాడికి దిగారు.
టిక్కెట్‌ ఇవ్వలేదని పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన ఘనత కోట్లకే చెల్లుతుందనీ, తాను అలాంటి పనులేవీ చేయలేదనీ, కోట్ల ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉచిత సలహా ఇచ్చారు టీజీ వెంకటేష్‌. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని ఇప్పటికీ చెబుతున్నాననీ, అధిష్టానం మనసు మార్చుకోవాలనే తాను కోరుతున్నానని టీజీ వెంకటేష్‌ చెప్పుకొచ్చారు.
ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెబుతాననే మాటకు ఇప్పటికీ కట్టుబడి వున్నానన్న టీజీ వెంకటేష్‌, తాను పదవి కోసం ఈ మాటలు మాట్లాడటం లేదనీ, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాననీ, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు చీత్కరించుకునే పరిస్థితులు వచ్చాయనీ, ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం కలగకుండా సమైక్యానికి కట్టుబడి వుండాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారాయన.
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/ticket-ivvaledu-ani-tagulabettina-49761.html#sthash.WzInYqX2.dpuf

0 Reviews:

Post a Comment