
హైదరాబాద్, జనవరి 24 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శుక్రవారం వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కలుసుకున్నారు. తనకు విజయవాడ ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆ సీటు ఇప్పటికే కేటాయించడం జరిగిందని ఆయనతో చెప్పారు. అయితే వేరే ఎక్కడయినా సీటు ఇవ్వాలని ప్రసాద్ అడినట్లు తెలియవచ్చింది.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, వ్యాపారాల్లో సంబంధాలు ఉన్నటువంటి పొట్లూరి ప్రసాద్ టీడీపీ టిక్కెట్ కోరడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది, సీమాంధ్రలో కూడా బలహీన పడుతున్నందని ఆలోచనతో ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నట్లు సమాచారం. కాగా పొట్లూరి ప్రసాద్‌పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
0 Reviews:
Post a Comment