ర్వాత వారు బయటకు వస్తున్న సమయంలో జేసీ వారికి ఎదురుపడ్డారు.
ఈ సమయంలో ఒక నాయకునితో జేసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లాలూచీ పడిందని వ్యాఖ్యానించారు. దీంతో సత్తిబాబు జోక్యం చేసుకున్నారు. "ఏమిటీ లాలూచీ అంటున్నావు? నీకు ఇంత వయసొచ్చింది. నోటిని అదుపులో పెట్టుకో. శిశుపాలుడిలా మాట్లాడు తున్న నీ తప్పులు లెక్క పెడుతున్నాం. కాంగ్రెస్‌లో ఉంటూ పదవులు పొందావు. రాజకీయంగా ఉన్నతి సాధించావు. ఆర్థికంగా లాభపడ్డావు. ఇప్పుడు కాంగ్రెస్‌ను అంటే ఎలా!?'' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో, జేసీ కాస్త నవ్వుతూ.. నేను లాలూచీ పడ్డారని అంటే ఎందుకంత ఆగ్రహం అని ఎదురు ప్రశ్న వేశారు. ముగ్గురు అభ్యర్థులను నిలిపిన తర్వాత ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అదనంగా ఉన్నారని, అయినా నాలుగో అభ్యర్థిని ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు. ఇది టీఆర్ఎస్‌తో లాలూచీ కావడం కాదా అని జేసీ దివాకర్ రెడ్డి నిలదీశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/59506#sthash.T26kEBZE.dpuf
0 Reviews:
Post a Comment