రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి సదారంకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. కాంగ్రెస్ తరఫున ముగ్గురినీ ప్రస్తుత రాజ్యసభ సభ్యులనే ఎంపిక చేశారు. కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ పేర్లును అధిష్టానం ఖరారు చేసింది.
అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు జెసి మూడు రోజుల క్రితమే ప్రకటించారు. తనకు సహకరించాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్ లతో పాటు పలువురు ఇతర నేతలను కోరారు. అధిష్టానాన్ని ధిక్కరించి జెసి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ చేసే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

sakshi
0 Reviews:
Post a Comment