
ఆయన వార్షిక వేతనాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం (ఈఐపీ) నిర్ణయిస్తుంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయనకు వార్షిక ఈఐపీ స్టాక్ అవార్డు అందుతుందని నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ నుంచి అందిన ఆఫర్ లెటర్ లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద అందిన జీతానికి గరిష్ఠంగా మూడు రెట్లు.. అంటే 300 శాతాన్ని యాన్యువల్ క్యాష్ అవార్డుగా అందిస్తారు. అయితే, ఆయన పనితీరును బట్టి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుందని ఆఫర్ లెటర్లో తెలిపారు. ఈ లేఖ కాపీని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ ఈసీకి కూడా పంపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత నాదెళ్ల సత్యనారాయణ చౌదరే ఈ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అయ్యారు. గత సంవత్సరం నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయలు క్యాష్ బోనస్ లభించింది.
0 Reviews:
Post a Comment