Contact us

276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కుభన్వర్‌లాల్‌
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి  భన్వర్‌లాల్‌ చెప్పారు.  రేపు నిర్వహించే రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి బి.ప్రసాదరావుతోపాటు ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రతి ఎమ్మెల్యే  పోలింగ్‌ ఏజెంట్‌కు చూపించే ఓటు వేయాల్సి ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్‌, పార్టీ ఓటు రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు.

0 Reviews:

Post a Comment