
విబజన బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కనిపించడానికి ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్,అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు ఈ మిషన్ పై ఇప్పటికే పలు రాష్ట్రాలు పర్యటించి వస్తే , ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో ధర్నా చేశారు.తాజాగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి,పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుమారు 7వేల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.ఇందుకోసం ప్రత్యేక రైళ్లలో వెళ్లబోతున్నట్లు తెలిపారు. తిరుపతి, రాజమండ్రి ల నుంచి ఈ రైళ్లు బయల్దేరతాయని ఆయన చెప్పారు. డిల్లీలో కిరణ్ ధర్నా వద్ద జనం పెద్దగా లేరన్న విమర్శ నేపద్యంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్లుంది.
0 Reviews:
Post a Comment