Contact us

పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు-కోడెల
విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ఎందుకు వాడారో మూలాలలలోకి వెళ్లాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.పార్లమెంటు లో జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవి అంటూనే , తెలంగాణ ఎమ్.పిలు కొందరు నరసరాపుపేట ఎమ్.పి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై దాడి చేశారని, అలాగే లగడపాటిపై కూడా దాడి జరిగిందని, అందువల్లనే స్ప్రే వాడారని , అందులో తప్పు ఏముందని ఆయన అన్నారు. పెప్పర్ స్ప్రే మారణాయుదం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పై ఇంత వ్యతిరేకత ఉన్నా , మొండిగా కేంద్రం వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అయితే ఎవరు దాడిచేసింది,తదితర విషయాలు తెలవడానికి మొత్తం వీడియో కవరేజీని బయటపెట్టాలని కోడెల డిమాండ్ చేశారు.

0 Reviews:

Post a Comment