డ్వాక్రా లోన్ల మాఫీ, రైతులు బ్యాంకుల నుంచి తీసుకొన్న లోన్ల మాఫీ, అన్నీ ఉచితమే, ఉద్యోగాల కోసం ట్రై చేయక నిరుద్యోగులుగా ఉన్నందుకు నెలసరి జీతంతో సహా..ఇంకా అనేక హామీలున్నాయి బాబు ఒరలో. ఇప్పటికే వీటి గురించి తెలుగు తమ్ముళ్లు వీధి వీధీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. వీటిని ప్రజలు నమ్మేయడం ఖాయమేనని, తమకు ఓటేయడం కచ్చితమని, తాము అధికారంలోకి వచ్చేసినట్టేనని వారు చెబుతున్నారు!
సంస్కరణ వాది అయిన చంద్రబాబు ఇలా ఉచిత హామీలు ఇవ్వడం ఏమిటని.. ఆయన అభిమానులే మరోవైపు నోరెళ్లబెడుతున్నారు. గతంలో ఉచితం అంటే అది వ్యవస్థకు ద్రోహం చేయడం అని చెప్పిన చంద్రబాబు వ్యవస్థ ను నాశనం చేసే హామీలను ఇచ్చేయడం ఏమిటని బాబును సంస్కరణ వాదిగా అభిమానించే వారు ప్రశ్నిస్తున్నారు! ఇక బాబు ఇచ్చే హామీలు అసలు అమలుకు సాధ్యం అయ్యేవే కాదనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో బాబు ఇచ్చే హామీలను అమలు పరచడం అసాధ్యం అని, అలా చేయడంలే అమెరికా బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ కు సరిపోదని అంటున్నారు. మరి ఈ విషయం గురించినే చంద్రబాబు వద్ద ప్రస్తావించి, డబ్బులు ఎలా సార్ అంటే.. జగన్ దోచుకొన్న డబ్బును రికవరీ చేసి ఖర్చుపెడతామని ఆయన అంటారు! మరి అంతకన్నా జనాలను వెర్రి వాళ్లను చేయడానికి వేరే సమాధానం ఏముంది?!
ఇక జనాలను వెర్రివాళ్లను చేసే పని ఇలా ఉంటే.. మరోవైపు నాయకులకు బాబు ఇస్తున్న హామీలు ఇంత కన్నా మాగొప్పగా ఉన్నాయి! మొన్న రాజ్యసభ సీటు విషయంలో అలిగిన మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు ఇచ్చిన హామీ ని వింటే ఎవరైనా అవాక్కువుతారు! వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా లభిస్తుందని, అప్పుడు మోడీకి చెప్పి మీకు గవర్నర్ పదవిని ఇప్పిస్తాం! అని చంద్రబాబు ప్రతినిధులు మోత్కుపల్లికి హామీ ఇచ్చారట! ఇది విన్న మోత్కుపల్లి కూడా బహుశా అవాక్కయ్యే ఉంటారేమో! రాజ్యసభ సీటు అడిగితే ఇవ్వకపోవడం కొంత వరకే దారుణం కానీ ఏకంగా గవర్నర్ పదవి నీకే అని హామీ ఇవ్వడం అంటే అది మరింత దారుణం అని మోత్కుపల్లి కుండ బద్దలు కొట్టాడట! మరి దీన్ని బట్టి తెలుగుదేశం అధ్యక్షుడు ప్రజలకే కాదు, నాయకులకు కూడా కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పవచ్చు!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/babu-janalake-kadu--50225.html#sthash.tNopkzdr.dpuf
0 Reviews:
Post a Comment