
ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం కూడా తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోనే ఉంటానని,తనపై కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాని ఆశ్చర్యంగా అది జరిగిన కొద్ది రోజులకే పార్టీ నుంచి గుడ్ బై చెప్పారు. అంతేకాక ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.వ్యక్తిగతంగా కూడా జగన్ గౌరవించడం లేదన్న అబిప్రాయం వ్యక్తం చేస్తూ, జగన్ మదం అణచడానికి పని చేస్తానని తీవ్రంగా అన్నారు.రఘురాజు డబ్బు మదంతో మాట్లాడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎదురు ఆరోపణ చేసింది.ఈ విమర్శల సంగతి ఎలా అసలు రాజు పార్టీని వదలడానికి కారణాలు ఏమిటన్నదానిపై రకరకాల కదనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది నరసాపురం వై.కాంగ్రెస్ అబ్యర్ధి ప్రసాదరాజును మార్చాలని ఈయన అడుగుతున్నారు.ప్రసాదరాజును మార్చడానికి జగన్ అంగీకరించడం లేదు. ప్రసాదరాజు పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదలుకుని కాంగ్రెస్ నుంచి వచ్చారని,అలాంటి వారిని ఎలా మార్చుతామని జగన్ ప్రశ్నిస్తున్నారని ఒక సమాచారం..కాగా రఘురాజు సన్నిహితుల కదనం ప్రకారం తాము చెప్పిన అభ్యర్దులను మార్చడం లేదని, ఏదైనా డబ్బు కు పోటీకి లింకు పెడుతున్నారని, ఒకసారి మనస్పర్ధలు వచ్చాక అక్కడ పని చేయడం కష్టమని బావించి పార్టీ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. అంతేకాక సుప్రింకోర్టులో రాజు కేసు వేయడం జగన్ కు ఇష్టం లేదని కూడా వీరు ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు మరో పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ విజయవాడ నుంచి పోటీచేయడానికి ముందుకు వచ్చి , తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాజు వెనక్కి వెళ్లారు.ఇది పార్టీ శ్రేణులపై, ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న చర్చ జరుగుతోంది
0 Reviews:
Post a Comment