
- హైదరాబాద్‌లో పంచాయితీ
- అరుణమ్మ పార్టీలోకి వద్దని నియోజకవర్గ నాయకుల ఫిర్యాదు
- ఎంిపీ శివప్రసాద్‌పై ఆగ్రహం
- మంత్రి వేధింపులకు బలయ్యామని తమ్ముళ్ల ఆవేదన
తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీధర్‌నాయుడును అ రుణకుమారి ఆర్థికంగా దెబ్బతీసిన విషయాన్ని చెప్పి వాపోయినట్టు తెలిసింది. టీడీపీలోకి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలోనే శ్రీధర్‌నాయుడును ఆమె తీవ్రంగా మందలించారని వాపోయారు. అరుణకుమారి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, వర్గాలను ప్రోత్సహించారని అలాంటి నాయకురాలు పార్టీలోకి వస్తే మరింతగా గ్రూపులు తయారవుతాయని ఆవేదనను వెళ్ల గక్కారు.
ఎంపీ శివప్రసాద్ సైతం పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని, మంత్రి అనుచరులకే పెద్ద పీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 15 ఏళ్లుగా అరుణకుమారి పార్టీ నాయకులపై కేసులు పెట్టి వేధించారని ఫి ర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అరుణకుమారిని తీ సుకోకుంటేనే పార్టీ బతుకుతుందని అధినాయకు డి వద్ద వాపోయినట్టు సమాచారం. అదేవిధంగా ఎంపీని కట్టడి చేయకుంటే ద్వితీయశ్రేణి నాయకు ల్లో అసంతృప్తిని చల్లార్చచడం కష్టమని బాబు వద్ద కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
‘అన్నీ నేను చూసుకుంటా. నాకు వదిలేయండి, మీరు కలిసి పనిచేయండి చాలు’ అని బాబు తనదైన శైలిలో నాయకులకు చెప్పి పంపారని తెలిసింది. అధినేత నుంచి సమాధానం దాటవేత ధోరణిలో ఉండడంతో తమ్ముళ్లు చేసేదిలేక అసహనంతో వెనుతిరిగినట్టు తెలిసింది.
0 Reviews:
Post a Comment