Contact us

మరోసారి బలపరచండి: జయసుధ
మరోసారి బలపరచండి: జయసుధ
సికింద్రాబాద్: పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీని మరోసారి ప్రజలు బలపరచాలని ఎమ్మెల్యే జయసుధ అన్నారు. సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం మెట్టుగూడ డివిజన్‌లో రాహుల్ యువజనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్‌రాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసుధ, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎంఆర్ శ్రీనివాస్‌రావు, జాతీయ యూత్ కాంగ్రెస్ షామిలి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు కాలనీలు, బస్తీల్లో పర్యటించిన యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి అనేకానేక సంక్షేమ పథకాలను అందుబాటులోనికి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.

0 Reviews:

Post a Comment