
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు.మనుషులతో పాటు రైతుల కోసం,పశువుల కోసం కూడా అంబులెన్స్లు లు పెడతామని ఆయన అన్నారు. నాలుగు నెలల్లో ముఖ్యమత్రి అవడం ఖాయమని, ఒక మనవడిగా వృద్దులకు ఏడు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని, ఒక అన్నగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇస్తామని, ఒక కొడుకుగా 108,104 సర్వీసులను చక్కగా పనిచేయిస్తామని అన్నారు. బెల్టు షాపులు లేకుండా చేస్తామని, ఆడ పోలీసులను కూడా నియమిస్తామని ఆయన అన్నారు.నాలుగు నెలల్లో సువర్ణయుగం వస్తుందని ఆయన అన్నారు.గతంలో వై.ఎస్.ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని ,కిలో రూపాయికే ఇస్తామని ఆయన అన్నారు. రైతులకు ఏడు గంటల క్వాలిటీ కరెంటు ఇస్తామని, ఆ తర్వాత దానిని తొమ్మిది గంటలకు పెంచుతామని జగన్ చెప్పారు.మొత్తం మీద నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయమన్న చందంగానే ప్రసంగం చేశారు
0 Reviews:
Post a Comment