Contact us

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు
జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు
న్యూఢిల్లీ: లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్ లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి ఏపీ భవన్ లో తెలంగాణ వాదుల ఆందోళన కొనసాగుతోంది.

0 Reviews:

Post a Comment