
దక్షిణ ఢిల్లీలోని హృషికేశ్ నగర్ ప్రాంతంలో తనకు స్వామితో పరిచయం అయ్యిందని, తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా ఆయనను కోరానని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనను ఓఖ్లా ప్రాంతంలో కలవాల్సిందిగా జనవరి 25న అతడు చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. అక్కడినుంచి తన కారులో ఎక్కించుకుని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు వివరించారు. దీ
ని గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా స్వామి ఆమెను బెదిరించాడని తెలిపారు. ఎలాగోలా అదే రోజు ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించి, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన స్వామి, ఓఖ్లా నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆశించారు. కానీ ఆయనకు అది దక్కలేదు.
0 Reviews:
Post a Comment