
భారతీయ జనతా పార్టీ కోట, నరేంద్ర మోడీ సొంత ప్రాంతం అయిన అహ్మదాబాద్ కు వెళ్లి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ వివాదాస్పద వ్యాఖ్యచేశారు. ఆర్.ఎస్.ఎస్.సిద్దాంతాలే గాందీజీ హత్యకు కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు.నేరుగా ఆర్ఎస్ఎస్ సంస్థే హత్యకు కారణం అనకుండా, దాని సిద్దాంతాలే కారణమని ఆయన అన్నారు. గుజరాత్ నేతలు వల్లభబాయ్ పటేల్ గురించి మాట్లాడేటప్పుడు చరిత్ర గురించి తెలియదా అని కూడా ఆయన ఎద్దేవ చేశారు.పటేల్ ను బిజెపి సొంతం చేసుకునే ప్రయత్నం నేపద్యంలో రాహుల్ ఈ విమర్శ చేశారు.
0 Reviews:
Post a Comment