Contact us

ఆదాల పోటీ చేసి ఉంటే.. ఒకరు ఓడిపోయేవారే
సమైక్య వాద అబ్యర్ధిగా ఆదాల ప్రభాకరరెడ్డి రంగంలో ఉంటే టిఆర్ఎస్ అభ్యర్ధి కేశవరావుతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ఒకరు ఇబ్బందిలో పడేవారే. గెలిచిన ఆరుగురు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు చేస్తే ఈ విషయం అర్దం అవుతుంది.ఎమ్.ఎ.ఖాన్ కు అత్యధికంగా నలభై తొమ్మిది, కెవిపి రామచంద్రరావుకు నలభై ఆరు. టిడిపి అభ్యర్దులు గరికపాటి మోహన్ రావు, సీతామహాలక్ష్మిలకు ముప్పై ఎనిమిది ఓట్ల చొప్పున రాగా కేశవరావుకు ఇరవైఆరు ఓట్లే వచ్చాయి.ఆదాలకు కూడా ఇరవై ఆరు ఓట్లు వచ్చి ఉంటే,అప్పుడు ఈ ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది.

0 Reviews:

Post a Comment