Contact us

ఎవరేమనుకున్నా.. డోంట్ కేర్!.
ఎవరేమనుకున్నా.. డోంట్ కేర్!.
‘‘మొన్న ‘ఇష్క్’... నిన్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’... ఇప్పుడు ‘హార్ట్ ఎటాక్’తో
 హ్యాట్రిక్ పూర్తయిపోయింది’’ అని నితిన్ సంతోషం వెలిబుచ్చారు.
 పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలన్న తన కల నెరవేరిందని ఆనందం
 వ్యక్తం చేస్తూ నితిన్ చెప్పిన ముచ్చట్లు.
 
 నేనంటే గిట్టనివాళ్లు చేసిన పనేమో!
 తొలిరోజు ఫ్లాప్ టాక్ ఎందుకొచ్చిందో నాకే అర్థం కావడంలేదు. నేనంటే గిట్టనివాళ్లు చేసిన పనేమో! అయితే... విదేశాల్లో ఈ టాక్ ప్రభావం చూపించింది. ఇక్కడున్నంత స్ట్రాంగ్‌గా అక్కడ వసూళ్లు లేవు. ఇక్కడ మాత్రం నా కెరీర్‌లోనే నంబర్‌వన్ సినిమాగా నిలిచింది. నా కెరీర్‌లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అత్యధిక ప్రారంభ వసూళ్లు తెచ్చిన సినిమా. దాన్ని తేలిగ్గా అధిగమించేసింది ‘హార్ట్ ఎటాక్. ‘ఇష్క్’ ‘ఎ’ క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే.. ‘గుండెజారి...’ ‘ఎ,బి’ కేంద్రాల్లో బాగా ఆడింది. ‘హార్ట్ ఎటాక్’ అయితే...  ఎ,బిలతో పాటు ‘సి’క్లాస్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవడం ఆనందంగాఉంది. 
 
 ఆనందంతో కన్నీళ్లొచ్చాయి
 కూల్‌గా పని చేయించుకోవడం పూరీగారి స్టైల్. ఆయన్ను ఫాలో అయి చెప్పినట్లు చేశానంతే. మార్నింగ్ షో ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా థియేటర్‌కెళ్లి పబ్లిక్‌లో సినిమా చూశాం. ప్రేక్షకుల అభిమానం, సినిమాతో వాళ్లు కనెక్టవుతున్న తీరు చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ఎందుకంటే.. పర్టిక్యులర్‌గా ఈ సినిమాకు మేం పడ్డ కష్టం అలాంటిది. మళ్లీ పూరీతో పనిచేసే అవకాశం వస్తే వదులుకోను. 
 
 నా పారితోషికం పెంచాననడం అవాస్తవం
 ఈ మధ్య బయటి సంస్థల్లో నేను సినిమాలు చేయలేదు. పూరీగారి బ్యానర్‌లో ‘హార్ట్ ఎటాక్’ చేశాను. అది కూడా నా సొంత సంస్థ కిందే లెక్క. సో... నేను పారితోషికం పెంచాననడం అవాస్తవం. ప్రస్తుతం నా దృష్టంతా కథలపైనే. ప్రేమకథలే నాకు సరిగ్గా సరిపోతాయి కాబట్టి.. ఇక నుంచీ నా వయసుకి తగ్గట్టుగా ప్రేమకథల్నే ఎంపిక చేసుకుంటాను. మంచి కథ, కాంబినేషన్ సెట్ అయితే... మల్టీస్టారర్ చేయడానికి కూడా నేను రెడీ. 
 
 ఇలా బురద జల్లుతున్నారేమో!
 నేను పవన్‌కల్యాణ్‌గారి పేరు వాడుకుంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. బహుశా... నేను సక్సెస్‌లోకి రావడం వల్లే నాపై ఇలాంటి బురద జల్లుతున్నారని నా అభిప్రాయం. నిజానికి ‘జయం’ నుంచే నా సినిమాల్లో ఎక్కడో ఒక చోట పవన్‌కల్యాణ్‌గారి సన్నివేశమో, డైలాగో ఉండేలా చూసుకుంటూ వచ్చాను. ఆయనపై నాకున్న ప్రేమ అది. నేనేంటో పవన్‌గారికి తెలుసు. ఆయనేంటో నాకు తెలుసు. మధ్యలో ఎవరేమనుకున్నా డోంట్ కేర్. 
 
 మార్చి నుంచి కరుణాకరన్ సినిమా...
 ఒక పాట మినహా ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ పూర్తయింది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం. అది కూడా ప్రేమకథే. ఇప్పటివరకూ అలాంటి కాన్సెప్ట్ రాలేదు. అలాగే సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాను. ఈ నెల 9న షూటింగ్ మొదలవుతుంది. మార్చిలో కరుణాకరన్  సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ రెండూ మా సొంత సినిమాలే.

0 Reviews:

Post a Comment