Contact us

జగన్ ఆ భాష మాట్లాడతారా!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇడుపలపాయ ప్లీనరీలో మాట్లాడిన భాషపై అనకాపల్లి ఎమ్.పి సబ్బం హరి మండిపడ్డారు.జగన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వాడవలసిన భాష అదేనా,పార్టీ అధ్యక్షుడి స్థాయికి తగిన భాషేనా అని హరి ప్రశ్నించారు. జగన్ తన వెంట్రుక కూడా కాంగ్రెస్,టిడిపిలు పీకలేవని, ఎన్ని కుట్రలు చేసినా వారే మీ చేయలేరని అనడంపై హరి మండిపడ్డారు.జగన్ సిగ్గు అనే పదం వాడడం సిగ్గు అనే పదానికి అవమానమని ఆయన అన్నారు.సమైక్యవాద ముసుగులో ఉన్న విభజనవాది జగన్ అని ఆయన ఆరోపించారు.

0 Reviews:

Post a Comment