Contact us

ఆడా, మగా కాని సీఎం కిరణ్
ఆడా, మగా కాని సీఎం కిరణ్: చుక్కా రామయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన ఉందా? లేదా? అనేది అర్థం కావడంలేదని.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆడా కాదు.. మగా కాదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య ప్రసంగించారు. కిరణ్‌తో పాటు సీమాంధ్ర నేతలంతా అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్,  ప్రొ.లక్ష్మణ్, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, రత్నమాల మాట్లాడారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/chukka-ramaiah-attack-on-cm-kiran-kumar-reddy-103352

0 Reviews:

Post a Comment