
మరోవైపు అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ అలుపెరుగని పోరాటాలు చేసిన వైఎస్‌ఆర్ సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా సమైక్య పోరాటం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేపట్టనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్ నేతృత్వంలో పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు.
0 Reviews:
Post a Comment