Contact us

కెవిపి నిరసనల వెనుక ఏదో వ్యూహం ఉండి ఉంటుందా?




రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన కెవిపి రామచంద్రరావు కూడా సమైక్యవాదం కోసం పోడియంలోకి వెళ్లడం విశేషంగా కనిపిస్తుంది.గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న కెవిపి రామచంద్రరావు స్వయంగా సమైక్యవాదే.సమైక్యవాదం కోసం ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.కాని అది ఆమోదం పొందలేదు.కాని తన టరమ్ పూర్తి అవుతున్న సమయంలో కెవిపి కొద్దిపాటి మౌనం పాటించారన్న అబిప్రాయం ఉంది. కాంగ్రెస్ రాజకీయాలలో కెవిపికి ఒక ప్రత్యేకత ఉంది.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరున్న కెవిపి ముఖ్యమంత్రిగా ఉంటూ వై.ఎస్.మరణించడంతో రాజకీయంగా ఇబ్బందులలో పడ్డారు.కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకింత అవమానానికి కూడా గురయ్యారు.ఆయనే చెప్పినట్లు గాందీ భవన్ కు కూడా ఆయన రాకుండా చేయడానికి ప్రయత్నించారు.తన అత్యంత ఆప్తుడైన వై.ఎస్ కుమారుడు జగన్ పార్టీ పెట్టినా ,అటు వైపు వెళ్లకుండా కాంగ్రెస్ లోనే నిలిచి ,చివరికి కాంగ్రెస్ లో తన ప్రాధాన్యత అధిష్టానానికి తెలిసేలా చేయగలిగారు. దాంతో కెవిపికి రెండోసారి రాజ్యసభ ఇవ్వవలసిన అవసరాన్ని అధిష్టానం గుర్తించింది. అయితే రెండోసారి ఎన్నిక కాగానే ఆయన కూడా రాజ్యసభ వెల్ లోకి వెళ్లడం,సేవ్ ఆంద్రప్రదేశ్ నినాదంతో ఉన్న ప్లకార్డును పట్టుకోవడం ఆశ్చర్యంగానే ఉంది. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోతే ,ఆయన మరి రెండోసారి రాజ్యసబ సీటు ఎందుకు ఆశించారో తెలియదు. కాంగ్రెస్ ఎందుకు ఇచ్చిందో అర్ధం కాదు.అలాగే మరణించేవరకు కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టంగా చెప్పిన మరుసటి రోజు కాంగ్రెస్ తీసుకున్న తెలంగాణ నిర్ణయానికి వ్యతిరేకంగా కెవిపి వ్యవహరించడం అంటే ఇందులో ఏదో మతలబు ఉండి ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రయోజనాల రీత్యా ఇలా చేస్తే బెటర్ అని ఆయన అధిష్టానాన్ని మెప్పించి ఉండాలి.లేదా ఇంకేదైనా కారణం ఉండి ఉండాలి.తెలంగాణ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈయనను తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా కెవిపి నిరసనల వెనుక ఏదో వ్యూహం ఉండి ఉంటుందా?

0 Reviews:

Post a Comment