Contact us

హైదరాబాద్ యుటి డిమాండ్ కు క్యాబినెట్ నో
హైదరాబాద్ ను యుటి చేయాలన్న సీమాంద్ర కేంద్ర మంత్రుల డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది.తెలంగాణ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో ఇక పార్లమెంటుకు వెళ్లడమే తరువాయిగా ఉంటుంది.పోలవరం ముంపు గ్రామాలను మాత్రం సీమాంద్రలో కలపడానికి కేంద్రం అంగీకరించింది.దాదాపు రెండు గంటలసేపు క్యాబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేబినెట్ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జైపాల్ రెడ్డి హాజరయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదను కూడా అంగీకరించలేదు. అలాగే శాసనసబ నియోజకవర్గాలను పెంచే ప్రతిపాదనను కూడా పక్కనబెట్టింది.

0 Reviews:

Post a Comment