Contact us

నరేంద్ర మోడీ అసోం టీ అమ్మేవాడా!


కాంగ్రెస్ పార్టీ ఏ ముహూర్తాన బిజెపి ప్రదాని అభ్యర్ధి నరేంద్ర మోడీని చాయ్ వాలా అని వ్యాఖ్యానించిందో అప్పటి నుంచి ఆ పాయింట్ ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి,నరేంద్ర మోడీ, బిజెపి నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా నమో టీ స్టాల్స్ పేరుతో బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు.మోడీ కూడా అసోం వెళ్లిన సందర్బంగా అసోం టీకి తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.తనకి అస్సాం రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధముందని , తన చిన్నతనంలో ప్రతిరోజూ అస్సాం టీ అమ్మడమే దానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. \'నా చిన్నప్పుడు ప్రతీరోజూ ఉదయం అస్సాం టీ అమ్మేవాన్ని. అలా అస్సాంతో నా అనుబంధం ప్రత్యేకమైనదని\' ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమబెంగాల్ పర్యటించినప్పుడు రవీంద్ర నాద్ టాగూర్ సోదరుడు గుజరాత్ లో ఉన్నారని, నేతాజి సుభాష్ చంద్రబోస్ కు గుజరాత్ తో లింకు ఉందని, హరిపుర కాంగ్రెస్ లోనే ఆయన కాంగ్రెస్ అద్యక్షుడయ్యారని వివరించారు.ఈ రకంగా ప్రతి రాష్ట్రంలోను, తన కు,గుజరాత్ కు ఉన్న సంబందాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.అది పలిస్తుందా?

0 Reviews:

Post a Comment