Contact us

మాటతీరు తెలియనివాడా కాబోయే సీఎం?
సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది జగన్
మాటతీరు తెలియనివాడా కాబోయే సీఎం?

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: 'సిగ్గు' అనే పదం వాడడానికి షర్మిలకు, జగన్‌కు అర్హత లేదని, వారు ఆ మాట అంటే ఆ పదమే సిగ్గు పడుతుందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విశాఖలో విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ ప్లీనరీలో షర్మిల తనను ఉద్దేశించి.. "సబ్బం హరి సిగ్గు లేకుండా ఇంకా కాంగ్రెస్‌లో ఎందుకు ఉన్నార''ంటూ చేసిన విమర్శపై ఆయన స్పందించారు. ఎవరు ఏ పార్టీలో ఉండాలో చెప్పాల్సిన అర్హత వారికి లేదన్నారు. ఇక్కడ (రాష్ట్రంలో) ఏమి జరిగిందో తెలియక ఆమె అలా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. షూటి ంగ్ అంతా అయిపోయి, ప్యాకప్ కూడా చెప్పేశారనే విషయం ఆమెకు తెలియదని, బహుశా తాను కూడా ఆ సమయంలో షూటింగ్‌కు వెళ్లి ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. ఇక ప్లీనరీలో జగన్ మాట్లాడిన తీరు చూస్తే బాధనిపించిందన్నారు. 'కిరణ్ నీకు సిగ్గుందా?, చంద్రబాబూ...నీకు సిగ్గుందా? ఈసారి వారిద్దరూ ప్రజల్లోకి వస్తే కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టండి' అంటూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతోపాటు 'అంతా కలిసి నా ఈక పీకగలిగారా?' అని వేదికపైనే అనడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టయిందన్నారు. "ఎన్నికలు జరిగితే తానే ముఖ్యమంత్రినవుతానని చెబుతున్న వ్యక్తి మాట్లాడేతీరు ఇదేనా?'' అని ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రం కోసం పాటుపడుతున్నవారిని దొంగలంటూ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది (జగన్) దిగజారుడు రాజకీయాలకు దిగడం బాధాకరమన్నారు. రానున్న పది రోజులూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో కీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కిరణ్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం లెక్క తప్పిందన్నారు. 'మనం ఎలా చెబితే అలా నడుచుకుంటాడ'ని మితిమీరిన విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు రాష్ట్ర విభజన విషయంలో తన దారి వేరని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారని గుర్తుచేశారు. సమైక్యాంధ్ర కోసం ఆవగింజంత అవకాశం ఉన్నా వదిలే ప్రసక్తి లేదన్నారు.
 http://www.andhrajyothy.com/node/61930#sthash.kr4P2YCa.dpuf

0 Reviews:

Post a Comment