Contact us

 కిరణ్ పై కాంగ్రెస్ చర్య తీసుకోలేదే-బిజెపి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు బిజెపి అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ ను కలిసి తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారని బిజెపి అదికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.తెలంగాణ కు పూర్తి మద్దతు ఉంటుందని రాజ్ నాద్ చెప్పారని, అదే సమయంలో కెసిఆర్ కు మరో విషయం చెప్పారని, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి గురించి కూడా చెప్పారని ఆయన అన్నారు. జూలైలో తెలంగాణ నిర్ణయాన్ని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నా, ఇంతవరకు బిల్లు తేలేదని,కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా ధర్నా చేశారని,అయినా కాంగ్రెస్ చర్య తీసుకోలేదని రాజ్ నాద్ అన్నారని జవదేకర్ తెలిపారు.అలాగే కాంగ్రెస్ ఎమ్.పిలు పార్లమెంటులో ఆటంకం కలిగిస్తున్నారని రాజ్ నాద్ అన్నారని అన్నారు. కాంగ్రెస్ వారు అటు తెలంగాణకు,ఇటు సీమాంద్రకు స్నేహితులు కారని సింగ్ పేర్కొన్నారని చెప్పారు.బిజెపి హయాంలో మూడు రాష్ట్రాలు ఎలాంటి ఘర్షణ లేకుండా ఏర్పడ్డ విషయాన్ని రాజ్ నాద్ గుర్తు చేశారని అన్నారు.

0 Reviews:

Post a Comment