Contact us

కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్‌ కోవర్ట్‌
'కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్‌ కోవర్ట్‌'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మాట తప్పని మడమ తిప్పని వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్‌, టీడీపీ కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
 
వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రఘురామ కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్‌ కోవర్ట్‌ అంటూ ధ్వజమెత్తారు. రఘురామరాజు పార్టీలో ఉన్నది 90రోజులేనని బాలరాజు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసం ఆయన పార్టీలో చేరారని ఆరోపించారు. ప్రయోజనాలు నెరవేరవనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారని బాలరాజు విమర్శించారు.

0 Reviews:

Post a Comment