
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరమవుతుందేమేననే సందేహం లోక్‌సభ సచివాలయం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో సలహా ఇవ్వాలని న్యాయ మంత్రిత్వశాఖను కోరింది. తెలంగాణలో 'శాసన మండలి' ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమవుతుందనే అభిప్రాయం ఉంది. ఆర్టికల్ 371 విషయంలో రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని అటార్నీ జనరల్ గులాం వాహనవతి గతంలోనే ప్రభుత్వానికి సూచించారు.
అయితే మంత్రుల బృందం ఆ సలహాను పక్కన పెట్టి... సాధారణ పునర్విభన బిల్లుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. మరో వైపు బిల్లు సాఫీగా ఆమోదం పొందేలా చూసేందుకు సహకరించాలని స్పీకర్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కోరారు. బుధవారం ఆయన దాదాపు గంట సేపు స్పీకర్‌తో చర్చలు జరిపారు. బిల్లును వ్యతిరేకించే సభ్యుల్ని అవసరమైతే తన విచక్షణాధికారం ఉపయోగించి సస్పెండ్ చేయాలని కోరారు.
బిల్లు ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనల్ని సడలించాలని స్పీకర్‌ను కమల్‌నాథ్ కోరారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో ఉంది. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలనే విజ్ఞప్తి వస్తే దానికి అంగీకరించవద్దని కూడా కమల్‌నాథ్ అన్నట్టు తెలుస్తోంది. హోం శాఖ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ నేత వెంకయ్యనాయుడు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
0 Reviews:
Post a Comment